గురువారం 04 మార్చి 2021
Siddipet - Dec 27, 2020 , 00:09:50

సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలి

సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలి

బాల వికాస ఆధ్వర్యంలో ‘సేంద్రియ’ వడ్ల్లు కొనుగోళ్లు 

రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రోత్సాహం 

నంగునూరు : సేంద్రియ సాగు ద్వారా పండించిన వడ్లను రైతుల వద్ద నుంచి క్వింటాల్‌కు రూ.2100 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని బాల వికాస ప్రతినిధి తిరుపతిరెడ్డి అన్నారు.  మండల పరిధిలోని పాలమాకులలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సేంద్రియ సాగు పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, ఇది రైతులకు మంచి లాభదాయకమన్నారు. వినియోగదారులకు సైతం నా ణ్యమైన బియ్యం అందుతాయన్నారు.  8 గ్రామాల్లో 1500 మంది రైతుల వద్ద నుంచి 2 వేల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. సేంద్రి య పంట ఉత్పత్తుల కొనుగోలుదారులకు త్వరలో మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు వేల్పుల ఐలయ్య, బాలవికాస సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

VIDEOS

logo