శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Dec 26, 2020 , 00:17:47

ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం

ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 

బెజ్జంకి : ఏసుక్రీస్తు జీవితం మానవళికి స్ఫూర్తిదాయమని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పెరుకబండ గ్రామంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. మరోవైపు మండల కేంద్రంలోని సీయోన్‌ ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు ఓరిగంటి ఆనంద్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. మండలంలోని చర్చిల్లో భక్తులు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. 

VIDEOS

logo