సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 25, 2020 , 00:22:14

భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌లో నెలకొన్న భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డితో కలిసి డివిజన్‌ పరిధిలోని భూ రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. డివిజన్‌ పరిధిలో అసంపూర్తిగా నిలిచిన భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ శాఖ అధికారులు, తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  


VIDEOS

logo