సోమవారం 08 మార్చి 2021
Siddipet - Dec 24, 2020 , 00:06:22

రెండు మండలాల సర్పంచ్‌ల ఫోరం ఎన్నిక

రెండు మండలాల సర్పంచ్‌ల ఫోరం ఎన్నిక

మద్దూరు: ధూళిమిట్ట, మద్దూరు మండలాల సర్పంచ్‌ల ఫోరం ఎన్నికలను బుధవారం ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. మద్దూ రు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా సలాఖపూర్‌ సర్పంచ్‌ వంగ భాస్కర్‌రెడ్డి, ధూళిమిట్ట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలిగా జాలపల్లి గ్రామ సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మీసాగర్‌లను వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎనలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులను ఎంపీపీతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు అభినందించారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి మండల అధ్యక్షుడు మంద యా దగిరి, కొమురవెళ్లి ఆలయ మాజీ చైర్మన్‌ మేక సంతోశ్‌కుమార్‌, వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, మాజీ జడ్పీటీసీ పేరం భిక్షపతి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బండి చంద్రయ్య, నలుగొప్పుల రాములు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌  నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo