శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Dec 24, 2020 , 00:06:20

భక్తాంజనేయస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు

భక్తాంజనేయస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు

చేర్యాల : మండలంలోని నాగపురి శివారు గండికుంట గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రతిష్ఠా మహోత్సవాలు   రెండు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీరామ ధూత సేవాసమితి ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రారంభించిన స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా బుధవా రం ద్వారతోరణ పూజ, ధ్వజకుంభ దేవతార్చన, నిత్యహోమం, జలాదివాస హో మం, తాన్యాదివాసం, తీర్ధప్రసాద వితరణ, వేద పారాయ ణం, ద్వారతోరణ పూజ, నిత్య హోమం తదితర పూజా కార్యక్రమాలను యాజ్ఞికులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పురోహితులు కొనసాగించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రెండు రోజులుగా శ్రీ అభయాంజనేయ స్వామి పౌరాణిక సింధు యక్షగానంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలకు ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గండికుంట ప్రాంతవాసులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు తాను 250 గజాల స్ధలం హనుమాన్‌ గుడి నిర్మాణానికి విరాళంగా అందించినట్లు తెలిపారు. దీంతో గండికుంట వాసులు అదే స్ధలంలో ఆలయాన్ని నిర్మించినట్లు, హనుమాన్‌ విగ్రహాన్ని నెలకొలుతున్నట్లు తెలిపారు.

VIDEOS

logo