మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Dec 23, 2020 , 00:23:21

ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

హుస్నాబాద్‌: సెమీ క్రిస్మస్‌ వేడుకలు హుస్నాబాద్‌  వీఎల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్థానిక బిలీవర్స్‌ చర్చ్‌ పాస్టర్‌ బొల్లం నవీన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితవెంకట్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్‌ సందర్భంగా పాస్టర్‌ నవీన్‌ తన సొంత ఖర్చులతో 112మంది మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. చైర్‌పర్సన్‌ రజిత మాట్లాడుతూ ఏసు క్రీస్తు సూచించిన శాంతి, సహనం, ప్రేమ, కరుణ, జాలి, దయ అనే గుణాలను ప్రతి ఒక్కరూ కలిగిఉండాలన్నారు. పాస్టర్‌ నవీన్‌ తన సొంత ఖర్చులతో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, బోజు రమాదేవి, బొల్లి కల్పన, వాల సుప్రజ, గోవిందు రవి, గూల్ల రాజు, భాగ్యరెడ్డి, ఎం రమేశ్‌, బొజ్జ హరీశ్‌, శంకర్‌రెడ్డి, ఎండీ అయూబ్‌, బొల్లం శ్రీలత, లలిత, పలు చర్చిల పాస్టర్‌ ఇవజిల్‌ రాజు, క్రైస్తవ సోదరులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. 


VIDEOS

logo