బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 23, 2020 , 00:23:21

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

చేర్యాల : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి రంగారావు కోరారు. స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ సభ్యత్వ నమోదులో భాగం గా మంగళవారం కస్తూర్భాగాంధీ స్కూల్‌, మోడ ల్‌ స్కూల్‌, ప్రాథమిక పాఠశాలలను ఎస్టీయూ జిల్లా నాయకులు సందర్శించి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అప్‌ గ్రేడెడ్‌ పండిట్‌, పీఈటీలతో సహా అన్ని క్యాటగిరీల పదోన్నతులు కల్పించాలని, పదోన్నతులతో పాటే సాధారణ బదిలీలు నిర్వహించాలని కోరారు. అంతర్‌ రాష్ట్ర, జిల్లా బదిలీలు చేపట్టాలని,  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 

  కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాడ శ్రీధర్‌, బస్వరాజ్‌ కనకయ్య, మండల అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌, వి.ప్రభాకర్‌, మద్దూరు అధ్యక్షుడు స్వర్ణకుమార్‌, ప్రధాన కార్యదర్శి జంగిటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo