సోమవారం 08 మార్చి 2021
Siddipet - Dec 23, 2020 , 00:23:18

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

దౌల్తాబాద్‌ : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో పోలీస్‌ సిబ్బందితో కలిసి అంబేద్కర్‌ చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడుపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై శంకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యం, సిబ్బంది రవి, హరికృష్ణ, పరశురాములు స్వామి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo