ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Dec 21, 2020 , 00:04:22

ప్లాస్టిక్‌ రహితంగా పెండ్లి వేడుక

ప్లాస్టిక్‌ రహితంగా పెండ్లి వేడుక

 సిద్దిపేట కలెక్టరేట్‌ : సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు సిద్దిపేట.. శుభాకారాల్లో మొక్క లు ఇవ్వడం.. పాస్టిక్‌ రహితంగా పెళ్లి వేడుక జరగడం.. మొక్కలు నాటే కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తితో ప్రజల్లో మార్పు..  తెచ్చేలా సిద్దిపేటలో ప్రముఖ వ్యాపారి నేతి కైలాసం భ్రమరాంభ దంపతులు కూతురి వివాహాన్ని ప్లాస్టిక్‌ రహిత, పర్యావరణ పరిరక్షణ సూచికంగా జరిపించారు. భైరి అంజయ్య గార్డెన్‌లో కైలాసం కూతురు వివాహానికి ఆదివారం మంత్రి హాజరయ్యారు. పెండ్లి బ్యానర్‌ నుంచి కానుకలు, అరటి ఆకుల్లో భోజనం, క్లాత్‌ డెకరేషన్‌, పువ్వులతో పెండ్లి పందిరి, స్టీల్‌ గ్లాసులు ప్లాస్టిక్‌ వినియోగం లేకుండా ఏర్పాటు చేశారు. పెండ్లికి వచ్చినవారికి జూట్‌ బ్యాగు ల్లో విత్తన బంతులు, ఫలంతోపాటు కానుకలను అందజేశారు.

VIDEOS

logo