దుబ్బాక రోడ్లకు మహార్దశ

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. మరమ్మతులకు రూ.22.06 కోట్లు
నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
యుద్ధప్రాతిపదికన పనులకు ఆదేశం
తీరనున్న ప్రయాణ తిప్పలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, వాహనదారులు
దుబ్బాక రోడ్లు తారుతో మెరువనున్నాయి. గుంతల ప్రయాణం దూరమై.. ఇక జర్నీ సాఫీగా సాగనుంది. దుబ్బాక నియోజకవర్గంలో గడిచిన వానకాలంలో భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, వీటి మరమ్మతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా రూ.22.06 కోట్లు మంజూరు చేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నిధులతో తొమ్మిది ప్రధాన రూట్లలో మరమ్మతులు చేసి ప్రయాణానికి అనుకూలంగా మారుస్తారు. భారీగా నిధులు కేటాయించడంతో నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- దుబ్బాక
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అంటే సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ. ఇటీవల సిద్దిపేట పర్యటనలో సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఇర్కోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.100కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో బీటీరోడ్ల మరమ్మతుల కోసం సీఎం కేసీఆర్ ఏకంగా రూ.22.06కోట్లు మంజూరు చేశారు. దుబ్బాకపై మమకారంతోనే సీఎం కేసీఆర్ నిధుల వరద కురిపించారు. బీటీ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
దుబ్బాక :
దుబ్బాక నియోజకవర్గంలో వర్షాలకు బీటీరోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.22.06 కోట్లు నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశా రు. నియోజకవర్గంలోని మిరుదొడ్డి, తొగుట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల్లో వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఆ రహదారులను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే టెండర్లు నిర్వహించి మరమ్మతులు చేపట్టనున్నారు.
మరమ్మతులకు నిధులు మంజూరైన రోడ్లు
ధర్మారం - వెంకట్రావ్పేట రోడ్డుకు .4.90కోట్లు..
దుబ్బాక నియోజకవర్గంలో తొగుట మండలంలో ధర్మారం - వెంకట్రావ్పేట రోడ్డు మరమ్మతుకు రూ.4.90కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డులో 4/8 కి.మీ నుంచి 16/0 వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
మెట్టు - దౌల్తాబాద్ రోడ్డుకు రూ.4.57కోట్లు..
సిద్దిపేట - దౌల్తాబాద్ రోడ్డులో 17/2 నుంచి 26/ 530 వరకు మరమ్మతు పనులు చేసేందుకు గాను రూ.4.57కోట్లు మంజూరు చేశారు.
సూరంపల్లి - నాచారం రోడ్డుకు .2.88కోట్లు ..
దుబ్బాక - గజ్వేల్ నియోజకవర్గాలను కలిపే సూరంపల్లి - నాచారం రోడ్డు. ఈ రోడ్డు రెండు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. సూరంపల్లి - నాచారం రోడ్డులో 4/0 నుంచి 22/0 వరకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.88కోట్లు మంజూరయ్యాయి.
భూంపల్లి - దొమ్మాట రోడ్డుకు రూ.5.07కోట్లు..
దుబ్బాక నుంచి చేగుంట, హైదరాబాద్‌కు వెళ్లేందుకు భూంపల్లి - దొమ్మాట రోడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. భూంపల్లి - దొమ్మాట రోడ్డులో 0/0 నుంచి 16/250 మరమ్మతులకు భారీగా రూ.5.07కోట్లు మంజురయ్యాయి.
భూంపల్లి - లింగుపల్లి, మెట్టు - దౌల్తాబాద్ రోడ్లకు రూ.1.61కోట్లు..
దుబ్బాక నియోజకవర్గంలో భూంపల్లి - లింగుపల్లి, మెట్టు - దౌల్తాబాద్ రోడ్లు.. మిరుదొడ్డి, దౌల్తాబాద్, దుబ్బాక మండలలోని గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రహదారులు. ఇందులో భూంపల్లి - లింగుపల్లి వయా (రుద్రారం) రోడ్డులో 0/0 నుంచి 10/7 వరకు , మెట్టు - దౌల్తాబాద్ వయా తిమ్మాపూర్, పద్మనాభంపల్లి (దుబ్బాక మండలం) ను కలిపే రోడ్డులో 0/0 నుంచి 9/550 వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.1.61కోట్లు మంజూరయ్యాయి.
రుద్రారం - ఖాజీపూర్ - కల్వకుంట రోడ్డుకు రూ.79లక్షలు..
మిరుదొడ్డి మండలంలోని రుద్రారం, ఖాజీపూర్, కల్వకుంట గ్రామాలకు వెళ్లే ఈ రోడ్డు మరమ్మతులకు గాను రూ.79లక్షలు మంజూరు చేశారు.
మొండిచింత - బేగంపేట రోడ్డుకు రూ.70 లక్షలు..
మిరుదొడ్డి మండలం మొండిచింత నుంచి బేగంపేట వరకు వెళ్లే రోడ్డు వర్షాలకు దెబ్బతిన్నది. ఈ రోడ్డు మరమ్మతుకు రూ.70లక్షలు మంజూరయ్యాయి. దీంతో మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాల ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారనున్నది.
చేగుంట (నాగపూర్- హైదరాబాద్) రోడ్డుకు రూ.1.54కోట్లు..
నాగపూర్ - హైదరాబాద్ ప్రధాన రహదారిలో చేగుంట పట్టణంలో రోడ్డు మరమ్మతులకు రూ.1.54కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నాగపూర్ - హైదరాబాద్ ఎన్‌హెచ్-44 వద్ద 416/4 నుంచి 421/0 (ఓల్డ్ ఎన్‌హెచ్-44 చేగుంట పట్టణంలో), నర్సాపూర్ - కుకునూరు రోడ్ 12/900 నుంచి 13/100 మెదక్ వరకు రోడ్డు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 9రోడ్లలో మరమ్మతులకు గాను రూ.22.06 నిధులు మంజూరయ్యాయి.
సంతోషంగా ఉంది..
సూరంపల్లి నుంచి నాచారం వెళ్లే రోడ్డు వర్షాలకు మొత్తం దెబ్బతిన్నది. గుంతలు పడి ఈ రోడ్డులో ఆటో నడపడం కష్టంగా మారింది. సీఎం కేసీఆర్ సారు ఈ రోడ్డు మంచిగా చేయిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇక మా ఆటోళ్లకే కాకుండా పెద్ద బండ్లు, చిన్న బండ్లు నడిపేటోళ్లకు కష్టం తప్పుతుంది.
- చామంతి కృష్ణ, సూరంపల్లి
రోడ్లు దెబ్బతిని ఇబ్బందిగా ఉంది..
వానలకు రోడ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసినందుకు సంతోషంగా ఉంది. మా ఊరి నుంచి నిత్యం వందల బండ్లు తిరుగుతాయి. వానలకు రోడ్లు కంకరతేలి గుంతలు పడ్డాయి. ఈ గుంతలలో నుంచి బండ్లు పోవడం కష్టంగా ఉంది. రోడ్డు మంచిగా చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
- ఎండీ షఫీ, వెంకట్రావ్పేట, తొగుట
పనుల్లో వేగం పెంచాలి.. మంత్రి హరీశ్‌రావు
జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ అభివృద్ధిపై కలెక్టర్ హనుమంతరావు ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, కలెక్టర్ హనుమంతరావు ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
తాజావార్తలు
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరుడు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!