సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 19, 2020 , 00:19:37

మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

సిద్దిపేట కలెక్టరేట్‌ : క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఫుట్‌బాల్‌ క్లబ్‌ ప్రతినిధి పాల సాయిరాం అన్నారు. శుక్రవా రం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఫుట్‌ టర్ఫ్‌ కోర్టు ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేయడంపై క్లబ్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సెక్రటరీ అక్బర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ క్లబ్‌ ప్రతినిధులు రాముగౌడ్‌, పీఈటీలు శ్రీనివాసు, సుజాత, వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo