కల్లాలతో సమస్య ఖల్లాస్

రైతుల పొలాల వద్ద జోరుగా కల్లాల నిర్మాణం
సిద్దిపేట జిల్లాలో వెయ్యికి పైగా నిర్మాణాలు పూర్తి
ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.100.53 కోట్ల నిధులు
సిద్దిపేట జిల్లాలో రూ. 34.64 కోట్లతో పనులు
సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
రైతులు ఆరుగాలం కష్టించి పంటలను పండించడం ఒక ఎత్తయితే, ఆ పంట ఉత్పత్తులను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేసుకోవడం మరోఎత్తుగా మారింది. కల్లాలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్లపైన ఆర బెట్టుకుంటున్నారు. దీంతో అటు రైతులతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్లుకొని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రైతులు కల్లాలు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.100.53 కోట్లు మంజూరయ్యాయి. కాగా, సిద్దిపేట జిల్లాలో 3,236 పంట కల్లాలకు గాను వెయ్యి పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
- సిద్దిపేట, నమస్తే తెలంగాణ
రైతులు ఆరుగాలం కష్టించి పంటను పండించడం ఒక ఎత్తయితే.. ఆ పంటను ఆరబ్టెటడం, నూర్పిళ్లు చేసుకోవడం మరో ఎత్తుగా మారింది. వానకాలంలోనైతే తీవ్ర ఇబ్బం దులు తప్పవు. ధాన్యం తడిసిపోతున్నది. దీంతో చేసేదేమీ లేక రైతులు పంట ఉత్పత్తులను రోడ్లపై ఆర బెట్టుతున్నారు. దీంతో రైతులతోపాటు వా హనదారులకు ఇబ్బందులు పడడ్తోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్లుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రైతులు కల్లాలు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. రైతుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కల్లాల నిర్మాణానికి భారీ గా నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల కోసం మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.100.53 కోట్లు మంజూరు చేయించారు. పనులు జోరుగా సాగుతుండడంతో రైతులకు ఇబ్బందులు తీరనున్నాయి.
సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డివిజన్లలోని ఆయా మండలాలు, గ్రామ పంచాయతీల్లో రైతులు పంట కల్లాల నిర్మాణం చేసుకుంటున్నారు. జిల్లా లో 4 వేల కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. వీటిలో 3,236 పంట కల్లాలకు పరిపాలన అనుమతులు వచ్చాయి. రూ. 34.64 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో వెయ్యికి పైగా నిర్మాణం పూర్తి చేసుకొని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తి చేసేందుకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులతో తరుచుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులు వారి పొలాల వద్ద యుద్ధ్ద ప్రాతిపదికన కల్లాలు నిర్మించుకుంటున్నారు.
ఇప్పటికే పంట కల్లాలు పూర్తి చేసుకున్న రైతులు, వానకాలం పంట ఉత్పత్తులను కల్లాల్లో ఆరబోసుకుంటున్నారు.
పంట కల్లాల నిర్మాణం రైతులకు మేలు...
కల్లాలు లేక రైతులు పండించిన పంట ఉత్పత్తులను రో డ్లపై ధాన్యం ఆరబోస్తున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయడం తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది రైతు లు, వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నది. ఫలితంగా ధాన్యం మొలకలు రావడం, బూజు పట్టడం, వివిధ రకాలుగా ధాన్యం పాడై రైతులు తీవ్రంగా నష్ట వాటిళ్లుతున్నది. ధాన్యం సరిగా ఆరక తగిన ధరను సైతం రైతులు పొందలేక పోతున్నారు.
3 నమూనాలుగా కల్లాల నిర్మాణం...
రాష్ట్ర ప్రభుత్వం 3 నమూనాలుగా కల్లాలను నిర్మించ డానికి అనుమతులు ఇచ్చింది. (1) 50 చదరపు మీటర్ల కల్లానికి రూ. 56,000, (2) 60 చ.మీటర్ల కల్లానికి రూ. 68,000, (3)వ 75 చ.మీటర్ల కల్లానికి రూ. 85,000 నిధులు ప్రభుత్వం అందజేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉన్న రైతులు, స్వయం సహాయక సభ్యులు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కల్లాల నిర్మాణానికి రెండు విడుతలుగా డబ్బులు చెల్లిస్తున్నది. పని ప్రారంభించి సగం మేర పూర్తి చేయగానే తొలి విడత డబ్బులు ఇస్తున్నది. కల్లం పూర్తికాగానే రెండో విడతలో మిగిలిన పూర్తి డబ్బులు రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం నిధులు ఇస్తుండడంతో నిబంధనలకు అనుగుణం గా రైతులు పొలాల్లో కల్లాలను నిర్మించుకుంటున్నారు.
ఆరబోసే బాధ తప్పింది
గతంలో ధాన్యం ఆరబోయాలం టే రోడ్లపై లేదంటే బిల్డింగులపై పోసే పరిస్థితి ఉండేది. కల్లాలను నిర్మించు కున్నంక మన పంటను మన కల్లాలపై పోసుకుని మనం ఇష్టమొచ్చినప్పుడు అమ్ముకునే సౌలత్ ఉంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం తక్కువగా ఉంటేనే సరైన ధర వస్తది. కాబట్టి ధాన్యం ఆరబెట్టుటకు కల్లాలు చాలా ఉపయోగపడుతాయి.
- ఎర్రం రాములు (బుస్సాపూర్ గ్రామ రైతు)
వర్షం పడితే చాలా తిప్పల
సరైన స్థలం లేక ఆరుగాలం పం డించిన పంట వర్షం పడితే తడువ కుండా కాపాడడానికి చాలా ఇబ్బం దులుండేవి. కల్లాల నిర్మాణంతో గాలి దూమారం వచ్చినా, వర్షం కురిసినా ధాన్యం వరదల పాలు కాకుండా ఎం తో ఉపయోగపడుతున్నాయి. కల్లాల నిర్మాణానికి ప్రభు త్వం రాయితీ ఇవ్వడంతో ఆర్థిక భారం తగ్గింది. పొలాల వద్దనే పంట ఆరబెట్టడానికి వీలుగా కల్లాలు ఉన్నాయి.
- ఒగ్గు మురళి (పుల్లూరు గ్రామ రైతు)
తాజావార్తలు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి