గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 19, 2020 , 00:12:37

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

గజ్వేల్‌రూరల్‌: వేర్వేరు ప్రమాదాలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం గజ్వేల్‌ మండల పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోమటిబండ గ్రామానికి చెందిన యాదగిరి (35), అదే గ్రామానికి చెందిన గుడికందుల గణేశ్‌ ఇద్దరు గురువారం రాత్రి వ్యవసాయ పొలం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో యాదగిరి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన గణేశ్‌ను గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ..

గజ్వేల్‌ మండలానికి చెందిన బొండ్ల భిక్షపతి (35), మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన రాజు ఇద్దరు కలిసి బైక్‌పై దౌల్తాబాద్‌లో  ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో రోడ్డుపై పోసిన వరి కుప్పకు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో భిక్షపతి తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

జగదేవ్‌పూర్‌: ఆటో, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలోని గణేష్‌పల్లి శివారులో శుక్రవారం జరిగింది. మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల ఎల్లయ్య తన భార్యతో కలిసి తొగుట మండలం వేములఘట్‌కు వెళ్లి తిరిగి చాట్లపల్లికి వస్తుండగా గణేశ్‌పల్లి శివారులో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్రగాయాలు కాగా, వారిని గజ్వేల్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

VIDEOS

logo