ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Dec 17, 2020 , 01:14:48

గూడులేని పేదలకే డబుల్‌ ఇండ్లు

గూడులేని పేదలకే డబుల్‌ ఇండ్లు

నయాపైసా లేకుండా నిర్మాణం.. అన్ని సౌకర్యాల కల్పన 

పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడుకోవాలి 

కేసీఆర్‌నగర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

180మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేటలో దశల వారీగా గూడులేని ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్‌ బె డ్‌రూం ఇండ్లు అందించడమే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ఆడిటోరియంలో 180మంది లబ్ధిదారులకు మం త్రి హరీశ్‌రావు పట్టాలు, ఇంటి నంబరు, కరెంట్‌, నల్లా, గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మా ట్లాడారు. పేదల సొంతింటి కల నిజం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నర్సపురంలో సకల సౌకర్యాలతో 2460 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించామ ని, మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. తొలి దశలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో 144మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేశారన్నారు. ఈ రోజు 180 మందికి పట్టా లు పంపిణీ చేశామన్నారు. జోర్దార్‌ వసతులతో.. నయాపైసా ఖర్చులేకుండా మార్కెట్‌లో రూ.15 లక్షల విలువ చేసే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సక ల సౌకర్యాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించిన పునఃపరిశీలన ప్రక్రియ జరుగుతున్నదని, వారిలో అర్హులైన వారికి త్వరలోనే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క పేద కు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో బిగ్‌ డే టాతో సరిపోల్చుతూ, అర్హులే లబ్ధిపొందేలా చూ స్తున్నామన్నారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి, ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా, పేదరికమే ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేశామన్నారు. కేటాయించిన ఇండ్ల ను పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్య త లబ్ధిదారులదేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చి నా, అమ్ముకున్నా, స్వాధీనం చేసుకుంటామని స్ప ష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు కేసీఆర్‌నగర్‌కు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్‌నగర్‌కు బస్తీ దవాఖాన వచ్చే వర కు ఒక ఏఎన్‌ఎం, ఆశవర్కర్‌తో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అనంతరం మంత్రి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు నూతన వస్ర్తాలు బహూకరించారు. కార్యక్రమంలో సిద్దిపేట అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, ఆర్డీవో జయచంద్రారెడ్డి, సుడా వైస్‌ చైర్మన్‌ రమణాచారి, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo