ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలి
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
జీవ వైవిధ్యాన్ని పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి : మంత్రి అల్లోల
ములుగు ఎఫ్సీఆర్ఐలో ‘బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ 2016’ బ్యాచ్ ప్రథమ స్నాతకోత్సవం
49మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
ములుగు : ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ) లో ‘బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ-2016’ బ్యాచ్ ప్రథమ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఆర్థిక మంత్రి హారీశ్‌రావు, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ము ఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మొదట కళాశాల ఆడిటోరియాన్ని ప్రారంభించి, అందులోనే 49మంది వి ద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ రంగాల్లో ప్ర తిభను కనబరిచిన విద్యార్థులు, అధ్యాపకులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, లలిత, రోహిత్ అనే విద్యార్థుల కు గోల్డ్ మెడళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆ ప్రత్యేక చొరవతో ములుగులో ఫా రెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశారని, దీన్ని చూస్తుంటే వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలను సందర్శించిన అనుభూతి కలుగుతుందన్నారు. అటవీ కళాశాలను ప్రారంభించేందుకు 1986లో ఐసీఏఆర్ అనుమతిస్తే, దేశంలోని ఇతర రాష్ర్టాలు ప్రారంభించినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాని ఊసేలేకుండాపోయిందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక దాని ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి, ములుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు రాణించాలని బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్సును ఏర్పాటు చేశారన్నారు. 2016లో ప్రారంభమైన కోర్సును విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసుకొని, ప్రథమ స్నాతకోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సుమారు 40మంది విద్యార్థులు విదేశాల్లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో పీజీలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు తమకంటూ ఓ ప్రత్యేకత, బాధ్యత ఉంటుందని గుర్తించి, తమ జూనియర్లకు ఓ ట్రెండ్ అలవాటు చేయాలని సూచించారు. మెట్టు పాలెం కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు ఐఎఫ్ఎస్ సర్వీస్ సాధించి, దేశవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని అటవీ కళాశాల విద్యార్థులు కూడా దేశంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. ములుగు ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు ఇప్పటికే విద్య, పరిశోధనల పరంగా అద్భుత ఫలితాలతో దేశ దృష్టిని ఆకర్షించారన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన సూర్య దీపిక, అబ్రాన్లోని ఎంఎస్సీ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ వర్సిటీలో ఉచితంగా ప్రవేశం సాధించినందుకు వారిని అభినందించారు. ఫారెస్ట్ కళాశాలలో తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు. భవిష్యత్‌లో అటవీ కళాశాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, కాలేజీ డీన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, కళాశాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్‌పాషా, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు జహంగీర్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్‌గౌడ్, ఎంపీటీసీలు బొడ్డు ప్రవీణ్, హరిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జీవ వైవిధ్యాన్ని పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి
అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఎఫ్సీఆర్ఐలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని పెంచేందుకు క్రియాశీలక పాత్ర పోషించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రం సాధించి సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని, అందులో భాగంగానే తెలంగాణకు హరితహారం చేపట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు 214కోట్ల మొక్కలు నాటించారన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించేలా చట్టం తెచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని కొనియాడారు. విద్యార్థులు తాము నిర్ధేశించుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ఎఫ్సీఆర్ఐ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకరావాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి