దశాబ్దాల ఆకాంక్షల ఫలితం

నేడు ధూళిమిట్ట మండల ఆవిర్భావం
ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
హాజరుకానున్న కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే
భారీ ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు
భవనాలను పరిశీలించిన అధికారులు
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
చేర్యాల/మద్దూరు : ధూళిమిట్ట మండల చిరకాల ఆకాంక్ష నేడు సాకారం కానున్నది. ధూళిమిట్ట గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలనే దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ మేరకు, సీఎం కేసీఆర్ వారి కలలను నిజం చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధూళిమిట్ట ఇకపై మండల కేంద్రంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగనున్నది. గతంలో మద్దూరు మండల కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రాంత ప్రజలకు, ఇక తిప్పలు తప్పనున్నాయి. గురువారం (నేడు) ధూళిమిట్ట మండలాన్ని ప్రారంభించేందుకు మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో పాటు జిల్లా అధికార యంత్రాంగం తరలిరానున్నది.
8 రెవెన్యూ గ్రామాలతో ధూళిమిట్ట మండలం
మద్దూరు మండలంలో ఉన్న 21 రెవెన్యూ గ్రామాల్లో 8 రెవెన్యూ గ్రామాలను కలిపి అధికారులు ధూళిమిట్ట మండలంగా ఏర్పాటు చేశారు. ఇక ధూళిమిట్ట మండలంలో ధూళిమిట్ట, లింగాపూర్, జాలపల్లి, తోర్నాల, బెక్కల్, కొండాపూర్, బైరాన్‌పల్లి, కూటిగల్ రెవెన్యూ గ్రామాలతో పాటు కొత్త గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించిన హనుమతండా, పంతులు తండా, రెడ్యానాయక్ తండాలు కొనసాగనున్నాయి. మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,316 జనాభా ఉంది. 3,702 గృహాలు ఉన్నాయి. ఇక మద్దూరు మండలంలో మద్దూరు, గాగిళ్లాపూర్, నర్సాయపల్లి, లద్నూర్, వల్లంపట్ల, రేబర్తి, వంగపల్లి, ధర్మారం, మర్మాముల, సలాఖ్‌పూర్ గ్రామాలు కొనసాగనున్నాయి.
చేర్యాల మండలంలోకి కమలాయపల్లి, అర్జున్‌పట్ల
ఎన్నో ఏండ్ల నుంచి తమ గ్రామాలను చేర్యాల మండలంలో కలుపాలని కోరుతూ వస్తున్న మద్దూరు మండలంలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామస్తుల కోరిక ఇవ్వాల నెరవేరనుంది. ఈ గ్రామాలను చేర్యాల మండలంలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలు మద్దూరు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ధూళిమిట్టను కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూళిమిట్టను మండల కేంద్రం చేయడంతో పరిసర గ్రామాలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందంటున్నారు. మండల కేంద్రానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను కలుపడం సంతోషంగా ఉందంటున్నారు. పరిసర గ్రామాలకు ఎంతో ప్రయెజనకరంగా ఉందని, కొత్త మండలంలో విలీనమైన గ్రామాల ప్రజలు చెబుతూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
8 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఏర్పాటు
జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ధూళిమిట్టను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్ ధూళిమిట్టను మండలంగా ఏర్పాటు చేశారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మండల ఏర్పాటుకు రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీల తీర్మాన పత్రాలను మద్దూరు ఎంపీపీ కృష్టారెడ్డి, స్థానిక సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి, ముఖ్య నాయకులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. సీఎం కేసీఆర్ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ధూళిమిట్టను మండలంగా ప్రకటించారు.
ముమ్మర ఏర్పాట్లు
కొత్త మండలం ఏర్పాటు సందర్భంగా ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, సర్పంచ్ దుబ్బుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు తాత్కాలికంగా భవనాలు ఎంపిక చేశారు. వాటికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ధూళిమిట్ట గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చేర్యాల-నంగునూరు రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు మామిడి తోరణాలు కట్టారు. మండల ప్రారంభం సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌కుమార్, జడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్‌తో పాటు డివిజన్, మండల స్థాయి అధికారులు ధూళిమిట్టలో పర్యటించారు. కార్యాలయాల ఏర్పాటుతో పాటు వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. మొదటగా మండల కేంద్రం లో తహసీల్ కార్యాలయంతో పాటు ట్రాన్స్‌కో, రైతు వేదికతో పాటు పలు కార్యాలయాలు నేడు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగిక దాడి!
- లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!