శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Dec 16, 2020 , 00:12:14

పోలీస్‌ శిక్షణను వినియోగించుకోవాలి

పోలీస్‌ శిక్షణను వినియోగించుకోవాలి

పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని పోలీస్‌ నియామక ఉచిత శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 2కే, 3కే రన్‌ మంగళవారం నిర్వహించారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు జెండాఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ 2కే, 3కే రన్‌లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ గన్న బాలకిషన్‌, నెహ్రూ యువకేంద్ర అధికారి బిన్సి, పీటీసీ ఆర్గనైజర్‌ కనకచంద్రం, పీటీసీ శిక్షకులు పాల్గొన్నారు.

VIDEOS

logo