పెండింగ్ పనుల్లో వేగం పెంచాలి

- ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలి
- ఈ నెలాఖరులోగా కనీసం 1500 ఇండ్లను అప్పగించాలి
- యూజీడీ, సెప్టిక్ ట్యాంకులు, పైపులైన్ పనులు చేపట్టాలి
- సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో పెండింగ్ పనులను మిషన్ మోడ్‌లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కోసం గజ్వేల్ పట్టణం ముట్రాజ్‌పల్లి వద్ద అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 614 ఎకరాల్లో చేపడుతున్న 2250 ఇండ్లకు గానూ కనీసం 1500 ఇండ్లను అన్ని హంగులతో పూర్తి చేసి, ఈ నెలాఖరులోపు తమకు అప్పగించాలని అధికారులు, ఏజెన్సీలను కలెక్టర్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం జరుగుతున్న స్థలంలో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి సం బంధించి ఇప్పటికే డ్రాయింగ్లు వచ్చాయని, ఆ పనులు యూజీడీకి సంబంధించి 30కి.మీ మేర ఇరువైపులా పైపులైన్ పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించి డిజైన్లు వచ్చాయని, ఈ పనులకు ప్రస్తుతం చేపడుతున్న పనులతో సమాంతరంగా ఎస్టీపీ పనులు చేపట్టాలన్నారు. వచ్చే 7 రోజుల్లోగా ఈఎల్ఎస్ఆర్ పనులు ప్రారంభించాలన్నారు. మొత్తం ఇండ్లకు సంబంధించి మూడు రోజుల్లో అవసరమైన టెక్నికల్ రిక్వైర్మెంట్ సంబంధిత ఏజెన్సీల నుంచి పొందాలన్నారు. అలాగే, మూడు ప్రధాన బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, ఇంటింటికీ నల్లా, విద్యుత్ కనెక్షన్, వీధి దీపాలు తదితర పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. పనుల ప్రగతిని సమీక్షిస్తూ ప్రతి వారం ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ బాధ్యులు చెన్నయ్య, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ పర్యవేక్షణ ఇంజినీర్ కనకరత్నం, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ రాజయ్య, హౌసింగ్ డీఈఈ రామచంద్రం, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..