శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Dec 15, 2020 , 00:29:07

104 వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

104 వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

గజ్వేల్‌ రూరల్‌ : 104 వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జాలిగామ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగల కౌసల్య, ముసలికాళ్ల నర్సయ్య, ఆకుల నవ్యశ్రీ  అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిలబడి ఉన్నారు. అదే సమయంలో గజ్వేల్‌ నుంచి రాయపోల్‌కు వెళ్తున్న 104 వాహనం వారిపైకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహ గద్దెను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, గజ్వేల్‌ దవాఖానకు తరలించారు. డ్రైవర్‌ సంతోశ్‌గౌడ్‌ మద్యం తాగి అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.  

క్షతగాత్రులను పరామర్శించిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

104 వాహనం ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకున్నారు. ప్రమాదాలు జరుగకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మూడు రోజుల వ్యవధిలోనే జాలిగామ గ్రామంలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం బాధకరమన్నారు.


VIDEOS

logo