ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 15, 2020 , 00:10:22

ప్రతి మొక్కను సంరక్షించాలి

ప్రతి మొక్కను సంరక్షించాలి

  • అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌ 

సిద్దిపేట కలెక్టరేట్‌ :  ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌ కోరారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, జడ్పీ సీఈవో శ్రవణ్‌, పంచాయతీ ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం జీవించే విధంగా చూడాలన్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు వంద శాతం సంరక్షించాలన్నారు. మొక్కలు ఎండిపోతే సంబంధిత గ్రామాల సర్పంచ్‌, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. శ్మశానవాటికలను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సమీక్షలో ఏపీడీ కౌసల్య, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, సిబ్బంది   పాల్గొన్నారు.  

VIDEOS

logo