శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 13, 2020 , 03:36:51

పోటాపోటీగా..

పోటాపోటీగా..

  • మంత్రి హరీశ్‌రావు కెప్టెన్సీలో క్రికెట్‌ మ్యాచ్‌ 
  • సిద్దిపేట టీమ్‌లో ఏకే ఖాన్‌, సీవీ ఆనంద్‌ 

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌ యశోద దవాఖాన సిబ్బంది మధ్య సిద్దిపేట స్టేడియంలో శనివారం రాత్రి డే అండ్‌ నైట్‌ ప్రారంభమైంది. మంత్రి హరీశ్‌రావు రెండోసారి కెప్టెన్సీలో జరిగిన టాస్‌ గెలిచిన సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సిద్దిపేట టీమ్‌లో సీవీ ఆనంద్‌, మైనార్టీ రెసిడెన్షియల్‌ చైర్మన్‌ ఏకే ఖాన్‌ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. సిద్దిపేట క్రీడాభిమానులు, యువకులు, చిన్నారులు పెద్దసంఖ్యలో క్రికెట్‌ చూడడానికి వచ్చారు. మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేటలో డే అండ్‌ నైట్‌ జరుగడం ఎంతో ఆనందంగా ఉందని, హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతున్న ప్లేయర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. తొలుత టాస్‌ గెలిచి యశోద టీమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసిన పోలీసు అధికారి సీవీ ఆనంద్‌ అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీశాడు. మంత్రి హరీశ్‌రావు ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో యువకులు పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. మంత్రి బంతిని పట్టినప్పుడల్లా ఈలలు వేస్తూ ఉత్సాహపర్చారు. 

VIDEOS

logo