శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 11, 2020 , 01:59:40

రైతు వేదిక ప్రారంభం సంతోషకరం

రైతు వేదిక ప్రారంభం సంతోషకరం

  •  తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌

సిద్దిపేట అర్బన్‌ : సీఎం కేసీఆర్‌ మిట్టపల్లి గ్రామానికి వచ్చి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని తెలంగాణ ఫిలిం చాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ అన్నారు.  సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో గురువారం సీఎం కేసీఆర్‌ రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన అనంతరం రామకృష్ణగౌడ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో రెండో రైతు వేదికను మిట్టపల్లిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తాను మిట్టపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా రెండు దఫాలుగా పని చేశానని రామకృష్ణగౌడ్‌ గుర్తు చేసుకున్నారు. రైతు వేదికలు అన్నదాతలకు ఎంతగానో దోహదపడుతాయన్నారు.  

VIDEOS

logo