బుధవారం 03 మార్చి 2021
Siddipet - Dec 12, 2020 , 00:26:51

ఓటు ఆయుధం

ఓటు ఆయుధం

  • 18ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలి
  • రాష్ట్ర ఎలక్ట్రోరోల్‌ పరిశీలకురాలు అనితారాజేంద్ర 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ఓటు హక్కు అనేది ఓ ఆయుధమని, జిల్లాలోని 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఎలక్ట్రోరోల్‌ పరిశీలకురాలు అనితారాజేంద్ర కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటరు జాబితా సవరణలను ఆమె పరిశీలించారు. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లోని బూతులను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. నియోజకవర్గ వారీగా ఓటరు నమోదు అధికారులు హాజరవగా, ఆయా డివిజన్ల ఆర్డీవో, తహసీల్దార్లు, ఎలక్షన్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, డీఆర్‌వో చెన్నయ్య ఓటరు నమోదు ప్రక్రియ, బీఎల్‌వోల విధి విధానాలపై ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఓటు హక్కు ఆవశ్యకతపై అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని, విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు, ఓటరు కార్డులో సవరణలకు 2021 జనవరి 5 లోపు సవరణలకు అవకాశమున్నదన్నారు. ఓటరు నమోదుకు, ఇతర మార్పు, చేర్పులు, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, తదితర సవరణ కోసం బీఎల్‌వోల దగ్గరికి వచ్చే ప్రజలు అవసరమైన అన్ని వివరాలు సక్రమంగా సిబ్బందికి తెలుపాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎలక్ట్రోరోల్‌ను అప్‌డేట్‌ చేయడానికి సహకరించాలని కోరారు.


VIDEOS

తాజావార్తలు


logo