మహిళలు ఎందులోనూ తీసిపోరు

- ఉత్తమ సేవలందించిన మహిళా పోలీసులకు రివార్డులు
- వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
సిద్దిపేట టౌన్ : మహిళలు ఎందులోనూ తీసిపోరని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ రె ట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ స్వాతిలక్రా, ఉమెన్ సెఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, అడిషనల్ డీజీ జితేందర్, శశిధర్‌రెడ్డితో కలిసి ‘మా ప్రతి పదం.. ప్రగతిరథం’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించారన్నారు. మహిళా సిబ్బంది సెఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం రాష్ట్రస్థాయిలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తున్నదన్నారు. ఏమైనా సమస్యలుంటే, నేరుగా తెలుసుకోవచ్చని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే, మహిళా పోలీసు అధికారులకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా స్థాయి ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో మహిళా సిబ్బంది 3.2శాతం ఉండగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 33శాతం రిజర్వేషన్లు కల్పించి రిక్రూట్మెంట్ నిర్వహించామని, దీంతో నేడు మహిళా సిబ్బంది 7.54శాతం ఉద్యోగాలు సాధించారన్నారు. మహిళా సిబ్బంది రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుడ్ ప్రాక్టీసు గురించి తెలుసుకోవాలని సూచించారు. మహిళా పోలీసులు చేసే మంచి పనులను మిగతా పోలీసు సిబ్బందికి వివరించి ప్రోత్సహించాలన్నారు. క మ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పటికప్పుడు పెంచుకోవాలని చెప్పారు. మహిళా సిబ్బంది కోసం పోలీసు స్టేషన్ పరిధిలో రెస్ట్, వాష్ రూములను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దూర ప్రాంతాలకు మహిళా సిబ్బంది, అధికారులు విధుల్లోకి వెళ్లినప్పుడు సం బంధిత పోలీసు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీసులకు రివార్డులను, అవార్డులను అందజేస్తున్నామన్నారు. పారదర్శకంగా నీతి నిజాయితీతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. మహిళా పోలీసు అధికారుల, సిబ్బంది ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ మహిళా సిబ్బంది సమస్యలు పరిష్కారం జిల్లా స్థాయిలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ, డివిజన్ స్థాయిలో మూడు కమిటీలు వివరించారు. ఏవో సవిత కమిటీలకు ఇన్చార్జిగా ఉన్నారని, నోడల్ అధికారిగా హెడ్ కానిస్టేబుల్ స్వాతిని నియమించామన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాసులు, రామేశ్వర్, ఏవో సవిత, ఆర్ఎస్ఐ స్రవంతి, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్
- భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- 7న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
- అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
- టీఎస్ బీపాస్‌కు విశేష ఆదరణ
- సురభి గెలుపే ధ్యేయంగా..
- పట్టభద్రులు ఆలోచించండి..!