శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 12, 2020 , 00:26:42

నేడు సిద్దిపేటలో డే అండ్‌ నైట్‌ లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌

నేడు సిద్దిపేటలో డే అండ్‌ నైట్‌ లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేటలోని క్రికెట్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సిద్దిపేట ఫ్రెండ్‌ షిప్‌ కప్‌ డే అండ్‌ నైట్‌ లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను జరుగనున్నది. ‘సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌'-‘యశోద దవాఖాన ఎలెవన్‌ డాక్టర్స్‌' మధ్య మ్యాచ్‌ జరుగుతుందని సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లికార్జున్‌ తెలిపారు. సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా మంత్రి హరీశ్‌రావు వ్యవహరిస్తారన్నారు. మంత్రితో పాటు ఏకే ఖాన్‌, సీవీ ఆనంద్‌, సీపీ జోయల్‌ డెవిస్‌ తదితరులు టీంలో ఉంటారన్నారన్నారు. మంత్రి హరీశ్‌రావు కృషితో స్టేడియం అభివృద్ధి చెందడంతో పాటు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు జరుగడం సిద్దిపేట క్రీడాకారులకు దక్కిన గౌరవమన్నారు. ఈ మ్యాచ్‌కు సిద్దిపేట సీనియర్‌ క్రికెటర్లు, క్రీడా అభిమానులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్‌రెడ్డి, విజయ్‌, నాగరాజు, మహేశ్‌, మజీద్‌, అక్బర్‌, మణిశంకర్‌ తెలిపారు.


VIDEOS

logo