అధునాతన హంగులతో ఫోర్‌సూట్ గెస్ట్‌హౌస్ ప్రారంభం

చిన్నకోడూరు : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, పెద్దకోడూరు గ్రామాల శివారులో రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో ని పల్లగుట్టపై రూ.7.68 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఫోర్‌సూట్ గెస్ట్‌హౌస్‌ను గురువారం సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ పల్లగుట్టపైకి చేరుకోగానే 2 మోటార్లను ఆన్ చేశారు. సీఎం కేసీఆర్ మోటార్ల ద్వారా వస్తున్న గోదావరి నీటిని అతిథి గృహం నుంచి వీక్షించారు. అనంతరం మం త్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎం పీలు ప్రభాకర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిష న్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, రఘోత్తంరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చం ద్లాపూర్, పెద్దకోడూరు గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రూపు ఫొటో దిగా రు. కార్యక్రమంలో కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, ఈఈ గోపాలకృష్ణ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కాముని శ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఉన్నారు.