ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Dec 11, 2020 , 02:43:20

ప్రశాంతంగా ముగిసిన సీఎం కేసీఆర్‌ పర్యటన

ప్రశాంతంగా ముగిసిన  సీఎం కేసీఆర్‌ పర్యటన

సిద్దిపేట టౌన్‌ : సీఎం కేసీఆర్‌ సిద్దిపేట పర్యటన ప్రశాంతంగా ముగిసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సీఎం కేసీఆర్‌ వచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. వెస్ట్‌జోన్‌ ఐజీ స్టిఫెన్‌ రవీంద్ర, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, సం గారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ జోయల్‌ డెవీస్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పర్యటన దృష్ట్యా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో సీఎం కేసీఆర్‌ పర్యటన ముగిసిందని బందోబస్తు విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.  


VIDEOS

logo