తెలంగాణ భవన్ ప్రారంభం

చేర్యాల/ నంగునూరు : సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ ప్రారంభించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పురోహితులు, పార్టీ ముఖ్య నాయకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోనే మొట్టమొదట టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి భవనంలోని ప్రత్యేక వసతులను పరిశీలించారు. అనంతరం మీటింగ్ హాలులోకి సీఎం కేసీఆర్ చేరుకొని ముఖ్య నాయకులను అప్యాయంగా పలకరించారు.
గతేడాది భూమిపూజ..
రూ.60 లక్షలతో నిర్మించిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గతేడాది జూన్ 24న భూమిపూజ చేశారు. త్వరతిగతిన పనులు చేపట్టి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం రాష్ట్రంలోనే మోడల్‌గా నిలువనుంది. జీ ప్లస్-1 పద్ధ్దతిలో భవన్ నిర్మించారు. 1500 మంది పార్టీ కార్యకర్తలు సమావేశంలో కూర్చుండే విధంగా సమావేశపు హాలు, మోడల్ కిచెన్, షెడ్, టాయిలెట్స్ తదితర వసతులను కల్పించారు. భవన నిర్మాణం చుట్టూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్థ్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, సతీశ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, సివిల్ సైప్ల్సె రాష్ట్ర చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఫారెస్ట్ డెవలఫ్‌మెంట్ రాష్ట్ర చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాజనర్సుతో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ వద్ద హైలెట్స్..
- 11.53 గంటలకు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు.
- 11.54 గంటలకు సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
- 11.55 గంటలకు తెలంగాణ భవలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు
- 11.56 గంటలకు తెలంగాణ భవన్ ప్రారంభించారు.
- 11.59 గంటలకు తెలంగాణ భవన్‌లోని మీటింగ్ హాలులో జిల్లా ముఖ్య నాయకులను కలుసుకున్నారు.
- 12.00 గంటలకు మీటింగ్ హాల్‌కు సీఎం కేసీఆర్ రాగానే జై తెలంగాణ నినాదాలతో హాలు హోరెత్తింది.
- 12.01 గంటలకు మీటింగ్ హాలుకు వచ్చిన జిల్లా ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ కరచాలనం చేశారు.
- 12.03 గంటలకు మీటింగ్ హాలులో ఉన్న ముఖ్య నాయకులు సీఎం కేసీఆర్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు
- 12.05 గంటలకు తెలంగాణ భవన్ నుంచి మిట్టపల్లి రైతువేదిక వద్దకు సీఎం కేసీఆర్ వెళ్లిపోయారు.
తాజావార్తలు
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..