ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 11, 2020 , 01:59:37

సిద్దిపేట డైనమిక్‌ ప్లేస్‌

సిద్దిపేట డైనమిక్‌ ప్లేస్‌

  • నాగులబండ వద్ద ఐటీ టవర్ల ఏర్పాటుకు శంకుస్థాపన 
  • హైదరాబాద్‌కు సమాన స్థాయిలో సిద్దిపేట అభివృద్ధి 
  • రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  

కొండపాక : సిద్దిపేట డైనమిక్‌ ప్లేస్‌... హైదరాబాద్‌కు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతున్న పట్టణం.. సిద్దిపేట ఐటీ రంగంలో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నాగులబండ వద్ద ఐటీ టవర్ల నిర్మాణం కోసం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ఎంవోయూ పత్రాలను అందజేశారు. 

నాలుగు ఐటీ కంపెనీలతో ఎంవోయూ.. 

నాగులబండ వద్ద ఏర్పాటు కానున్న ఐటీ టవర్లలో పనిచేసేందుకు నాలుగు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. అమెరికాకు చెందిన జోలన్‌ టెక్నాలజీ, ఇస్కాన్‌ టెక్‌, ఎమ్‌ రోడ్స్‌, నెట్‌ విజన్‌ కంపెనీల ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ ఎంవోయూలను అందజేశారు. 300 సీట్లలో, 3 షిప్టుల్లో మొత్తం 900 మంది ఐటీ ఉద్యోగులు సేవలు అందిస్తారని, రూ.45 కోట్లతో 60 వేల చదరపు అడుగులలో తొలిదశ నిర్మాణాలను ఒక సంవత్సరం లోపు పూర్తి చేస్తామని టీఎస్‌ఐఐసీ ప్రతినిధి తెలిపారు. 

హాజరైన ప్రముఖులు.. 

ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కార్పొరేషన్‌ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, వంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌, ఎంపీపీ ర్యాగళ్ల సుగుణ దుర్గయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహదేవ్‌, ఎంపీటీసీ గురజాల బాలాజీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo