గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 10, 2020 , 00:13:46

సిద్దిపేటకు మరో మణిహారం

సిద్దిపేటకు మరో మణిహారం

  • రూ.160 కోట్లతో సిద్దిపేటకు బైపాస్‌ రోడ్డు 
  • పొన్నాల రాజీవ్‌ రహదారి నుంచి దుద్దెడ రాజీవ్‌ రహదారి వరకు 76 కి.మీ పొడవుతో బైపాస్‌ నిర్మాణం 
  • సిద్దిపేట పట్టణానికి పూర్తి స్థాయి రింగు రోడ్డు
  • ‘కేసీఆర్‌ మార్గ్‌'గా నామకరణం చేసేందుకు మంత్రి  నిర్ణయం 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట సిగలో మరో మణిహారం వచ్చి చేరనున్నది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో రూ.160 కోట్ల అంచనా వ్యయంతో సిద్దిపేట పట్టణానికి బైపాస్‌ రోడ్డును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మాణం పొన్నాల రాజీవ్‌ రహదారి నుంచి ప్రారంభమై దుద్దెడ రాజీవ్‌ రహదారి వరకు 76 కిలోమీటర్ల పొడవుతో సిద్దిపేట నియోజకవర్గంలోని 5 మండలాలు, గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక మండలాల్లో రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఈ రోడ్డుకు కేసీఆర్‌ మార్గ్‌గా నామకరణం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేట ప్రజలతో పాటు హుస్నాబాద్‌, దుబ్బాక, గజ్వేల్‌, మానకొండూరు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యంగా మారనున్నది. బైపాస్‌ రోడ్డు నిర్మాణంతో హుస్నాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్రజలకు 15 నుంచి 20 కి.మీ మేర ప్రయాణం తగ్గతుంది. కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, మెదక్‌ వెళ్లే వారు సిద్దిపేట పట్టణంలోకి రానవసరం లేకుండానే బైపాస్‌ మార్గం ద్వారా వెళ్లేందుకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బైపాస్‌ను సింగిల్‌ బీటీ రోడ్డు నుంచి డబుల్‌ రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేట పట్టణానికి పూర్తి స్థాయిలో రింగురోడ్డు నిర్మాణం జరుగనున్నది. 


VIDEOS

logo