పటిష్ట బందోబస్తు

సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..
- ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు.
- 11గంటలకు దుద్దెడ (నాగులబండ) వద్ద ఐటీ పార్కుకు భూమిపూజ
- 11.20 గంటలకు పొన్నాల వద్ద తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం
- 11.40 గంటలకు మిట్టపల్లి వద్ద రైతువేదిక ప్రారంభోత్సవం
- 12.00 గంటలకు మెడికల్ కళాశాల భవనం ప్రారంభోత్సవం
- 12.30 గంటలకు కోమటి చెరువు, నెక్లెస్‌రోడ్డు సందర్శన
- 12.45 గంటలకు కేసీఆర్ నగర్ (సిద్దిపేట నర్సపురం) డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం
- 1.20 గంటలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (చింతలచెరువు వద్ద) ప్రారంభోత్సవం
- 1.40 గంటలకు రంగనాయకసాగర్ అతిథి గృహం ప్రారంభోత్సవం
- 3.00 గంటలకు డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు
- 4 గంటలకు సిద్దిపేట నుంచి తిరిగి ప్రయాణం అవుతారు.
సిద్దిపేట టౌన్ : సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు, సిబ్బందికి బుధవారం ఆయన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ జోయల్ డెవిస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని, బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను, పరిసరాలను అనుక్షణం గమనిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను చేపట్టాలన్నారు. పోలీసు అధికారులందకీ కమ్యూనికేషన్ సెట్లను ఇచ్చామన్నారు. విధి నిర్వహణలో ఉండే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీ చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటవెంటనే వాహనాలను క్రమపద్ధతిలో పెట్టించాలని సూచించారు. సీఎం వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలుపకుండా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.
1503 మంది పోలీసులతో బందోబస్తు ..
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామన్నారు. 29 సెక్టార్లుగా భద్రతా ఏర్పాట్లను విభజించామని తెలిపారు. అడిషినల్ ఎస్పీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్, స్పెషల్, రోప్ పార్టీస్, బీడీ టీమ్స్, డాగ్ స్కాడ్స్, సెక్యూరిటీ వింగ్, మప్టీ పోలీసులు ఇలా మొత్తం 1503 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
4 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ..
ప్రజలకు, వాహనదారులకు సీఎం కేసీఆర్ సమావేశానికి వచ్చే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రదేశాలను నాలుగు చోట్ల ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. డిగ్రీ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ వచ్చే 4 చక్రాల వాహనదారుల కోసం డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న పీజీ కళాశాల గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వీఐపీలు, మీడియా వారు తాడూరి బాలాగౌడ్ పంక్షన్‌హాల్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ సభాస్థలికి రావాల్సి ఉంటుందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ శాఖల అధికారులు డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న విద్యుత్ భవన్లో వాహనాల పార్కింగ్ చేసుకోవాలన్నారు. ముస్తాబాద్ ఎక్స్‌రోడ్ కుడివైపు ఉన్న గూన ఫ్యాక్టరీలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు వెంకటేశ్వర్లు, సృజన, ఏసీపీలు శ్రీనివాసులు, రామేశ్వర్, మహేందర్, నారాయణ, సురేంద్ర, సీఐలు సైదులు, సురేందర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మూడు ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్
ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా 3 ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. 1) సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్ అంబేద్కర్ చౌరస్తా నుంచి సిద్దిపేట పట్టణానికి వచ్చే వాహనాలు నాగదేవత ఆలయ చౌరస్తా మీదుగా సిరిసిల్ల బైపాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2) నాగదేవత టెంపుల్ చౌరస్తా నుంచి సిద్దిపేటకు వచ్చే వాహనాలు సిరిసిల్ల బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి. 3) సీఎం కేసీఆర్ పర్యటనకు వచ్చే అర్థగంటకు ముందుగానే ఎన్సాన్పల్లి చౌరస్తాలో ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని తెలిపారు. ప్రజలందరూ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..