సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 07, 2020 , 00:33:46

కొండపోచమ్మకు కోటిదండాలు

కొండపోచమ్మకు కోటిదండాలు

జగదేవ్‌పూర్‌ : మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ కొండపోచమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి వార్షికోత్సవాలకు పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండో రోజు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని కొండపోచమ్మకు చేరుకున్నారు. భక్తులు కొండపోచమ్మను ఊరేగింపుగా బోనాలు తీయడంతోపాటు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరసరాల్లో  వంటావార్పు సందడి కనిపించింది. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులను ఆలయంలోకి అనుమతించిన్నట్లు ఆలయ అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. 

VIDEOS

logo