బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 06, 2020 , 00:11:23

యాసంగి వరి నారుకు చలి బెడద

యాసంగి వరి నారుకు చలి బెడద

  • సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నారు దక్కుతది..
  • అనుకూల రకాలనే సాగుచేయాలి

గజ్వేల్‌ :యాసంగి వరి సాగు విస్తీర్ణం బాగా పెరుగనుంది. నారు పోసే సమయం ఇది. చలి పెరుగడం, ఉష్ణోగ్రతలు తగ్గడంతో వరినారు ఎదుగుదలకు తీవ్ర అవరోధంగా వాతావరణ పరిస్థితుల మారాయి. ఈ నేపథ్యంలో స రైన యాజమాన్య పద్ధ్దతులు పాటించడం అవస రం. సాగు రకాలను ఎంపిక, నారుమడి తయారీతో పాటు చలితో నారు పెరుగుదలకు అవరోధం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నవంబర్‌ నుంచి యాసంగి వరినారు పెంపకానికి రై తులు నారు పోస్తుంటారు. యాసంగిలో స్వల్పకాలిక రకాలతో పాటు మామూలు రకాలను సాగు చేస్తారు. యాసంగి సీజన్‌ వరిపైరుపై ఆ శించే పలు రకాల చీడపీడ తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. హైబ్రి డ్‌, సాధారణ, విత్తన రకాలను ఈ సీజన్‌లో ఎ క్కువగా సాగుచేస్తారు. అధిక దిగుబడుల కోసం హైబ్రిడ్‌ విత్తనాలను సాగుకు రైతులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయా కంపెనీల ర కాలను రైతు ఆనుభవంతో ఎంపిక చేసుకోవ డం ముఖ్యం. వానకాలం వరి సాగుచేసిన పొ లాల్లో తిరిగి యాసంగి వరి సాగుచేసే ప్రాంతం లో, వరి కోసిన తర్వాత దుక్కి దున్నుకుని ముందుగా నారు పెంపకం పనులు చేపడుతున్నారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో అధికంగా నారు పెంపకం పనులు జరుగుతాయి. చలి తీ వ్రత పెరుగడంతో వడ్లు మొలక సరిగా రాక పో వడం, మొలక మడిలో అలికిన తర్వాత నారు ఎర్రబడి చనిపోవడం లాంటి ఇబ్బందులు చలి తీవ్రతతో ఏర్పడుతాయి. ఈ సమస్యలు ఉత్ప న్నం కాకుండా నారు పెంపకంలో ముందు జాగ్రత్తలు పాటించాలి.

  • రాత్రి ఉష్ణోగ్రత12 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తగ్గినప్పుడు చలి తీవ్రతతో నారు చనిపోవడంతో పాటు సరిగా ఎదుగదు. యాసంగి నారుమడిలో కోడి పెంట, లేదా మేక, గొర్రె ఎరువును చల్లితే చలి తీవ్రతను నారు తట్టుకుని మంచిగా పెరుగుతుంది. 
  • భాస్వరం ఎరువును వానకాలం వాడిన మోతాదుకు రెట్టింపు వాడడంతో కూడా చలిని తట్టుకునే శక్తి వరినారుకు ఉంటుంది. మడిలో మొలక చల్లిన తర్వాత రెండు రో జులు ఆరబెట్టాలి. తర్వాత వారం రోజులు తడులు బోరు నుంచి వచ్చే నీరును నేరుగా పారించడం మంచిది. పొలంలో నిల్వ ఉన్న నీరును నారుమడిలోకి పారిస్తే అది చల్లగా ఉంటుంది. బోరు నీరు నారుమడిలోకి మల్లించడంతో వెచ్చగా ఉండి చలి తీవ్రత తగ్గించినట్లవుతుంది. 
  • నారు అలికిన తర్వాత నారుమడిపై పాలిథీన్‌ షీట్‌ లేదా పాలిపూవెన్‌ (పట్టా)ను కర్రతో నాటి రాత్రి సమయంలో కప్పి ఉద యం తీసివేయాలి. నారు మడిలో, ప్రధాన పొలంలో జింకును వాడడంతో చలి ఇబ్బందిని ( నారు, పైరు) తట్టుకుంటుంది. 
  • నారు ఆరోగ్యంగా పెరుగడానికి  యూరియా అందించే సమయంలో ఒక కిలో యూరియాకు 2 గ్రాముల కార్బండాజిమ్‌, మాంకోజెబ్‌  మిశ్రమాన్ని వాడా లి. నారు కొంత ఎత్తు పెరిగే వరకు రాత్రి సమయంలో నీరు పెట్టి ఉదయం తీసివేయాలి. నాటువేసే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడిలో 800గ్రాముల కార్బోపూరాన్‌ 3జీ గులికలను చల్లి, నీరు బయటకు పోకుండా అందులోనే ఇంకేలా చూడాలి. తద్వారా నాటువేసిన 20 రోజుల వరకు ప్రధాన పొలంలో వరి పైరుపై పలు రకాల తెగుళ్లను నివారించవచ్చు. 
  • ఎకరాకు హైబ్రిడ్‌ రకాలు 2 నుంచి 4 కిలో లు మధ్యస్త రకాలతే 10 కిలోలు, సాధారణ రకాలు 30 కిలోల విత్తనం అవసరం ఉంటుం ది. విత్తనశుద్ధితో పాటు మొలక శాతం పెంచుకునే చర్యలు చేపట్టాలి. నారులో కలుపు ఉంటే నివారించాలి. 
  • విత్తినాలు 8 నుంచి 10 రోజుల లోపు బ్యూటాక్లోర్‌ లేదా ప్రెటిలాక్లోర్‌ , సెఫనర్‌ 25 మి.లీ ఎకరా పొలానికి సరిపడా నారుపై 5లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు నివారణకు సైహలోఫాప్‌-పీ బ్యుట్రెల్‌ అనే కలుపు మందును 1.5మి లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

యాసంగి అనుకూల రకాలు..

జిల్లాలో యాసంగిలో స్వల్ప కాలిక రకాలతో పాటు సాధారణ రకాలను సాగు చేస్తారు.

  • తెలంగాణ సోనా ( ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) ఇది వానకాలంతో పాటు యాసంగిలోనూ జిల్లాలో సాగుకు అనుకూలం. గింజ రాలదు, అగ్గితెగులు మొగిపురుగు, తెల్లకంకి, కాండం తొలుచు పురుగును తట్టుకుని మంచి దిగుబడి వస్తుంది.
  • బతుకమ్మ (జేజీఎల్‌18047) గింజ రాలదు, దొడ్డు రకాలను ఆశించే పలు తెగుళ్లను ఈ రకం తట్టుకుని యాసంగిలో మంచి దిగుబడి వస్తుంది.

VIDEOS

logo