గెలుపు సంబురం

- పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు డివిజన్లు కైవసం
- జనగామ ఎమ్మెల్యే ఇన్చార్జి వహించిన కాప్రా డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
కొమురవెల్లి : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ సత్త్తా చాటడంతో శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇన్చార్జిగా ఉన్న కాప్రాలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిద్ధప్ప, వైస్ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, రసూలాబాద్ సర్పంచ్ స్వామిగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని నర్సింహులుగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కిషన్, ముత్యం నర్సింహులు, మెరుగు కృష్ణాగౌడ్, సార్ల కిష్టయ్య, నాగిరెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు ఏర్పుల మహేశ్ పాల్గొన్నారు.
ప్రజలకు ధన్యవాదాలు: దేవీరవీందర్
కొండపాక : తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ఎదురులేదని జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరోమారు రుజువు చేశాయని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్కు విజయాన్ని అందించాయన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
కొండపాకలో సంబురాలు...
కొండపాక : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో శుక్రవారం టీఆర్ఎస్ కొండపాక నాయకులు కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనెకుమార్యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని వెలికట్ట చౌరస్తా వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దోమల ఎల్లం, రమేశ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో టీఆర్ఎస్ సంబురాలు ..
సిద్దిపేట కలెక్టరేట్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో జిల్లా కేంద్రం సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ సర్కిల్లో పటాకులు కాల్చి, స్వీట్లను పంపిణీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు డివిజన్లలోను టీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఘన విజయం సాధించారన్నారు.
టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు..
చేర్యాల : జనగామ, సిద్దిపేట ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ పట్టణ, మండల నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించిన కాప్రా డివిజన్ అభ్యర్థి స్వర్ణరాజ్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు దినేశ్ తివారీ, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, శివగారి అంజయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పుష్పానగేశ్ను సన్మానించిన మాదాసు శ్రీనివాస్
గజ్వేల్ అర్బన్ : రామచంద్రాపురం 112వ డివిజన్ కార్పొరేటర్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పుష్పానగేశ్ను టీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట టీఆర్ఎస్ గజ్వేల్, మర్కూక్ మండలాధ్యక్షులు బెండ మధు, కరుణాకర్‌రెడ్డి, నాయకులు పండరి రవీందర్రావు, అహ్మద్, రమేశ్ తదితరులున్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్