సోమవారం 18 జనవరి 2021
Siddipet - Dec 04, 2020 , 00:15:35

‘ధరణి’తో రైతుల్లో ఆనందం

‘ధరణి’తో రైతుల్లో ఆనందం

లంచాలు అడిగేవారులేరు.. రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిరిగే పరిస్థితిలేదు.. రేపురా, మాపు రా అని తిప్పుకునే వారులేరు.. స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని నేరుగా తహసీల్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకుని పత్రాలతో ఆనందంగా ఇంటికి వెళ్లే పరిస్థితులు రావడంతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతున్నది. ధరణి రిజిస్ట్రేషన్లు తహసీల్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తీరును పరిశీలిస్తున్న రైతులు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. దీంతో రైతుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతున్నది. 

హుస్నాబాద్‌లో మూడు రిజిస్ట్రేషన్లు..

హుస్నాబాద్‌ టౌన్‌ : హుస్నాబాద్‌ తహసీల్‌ కార్యాలయంలో గురువారం మూడు రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తహసీల్దార్‌  అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు.  మండలంలో 53  రిజిస్ట్రేషన్లు  చేశామని తహసీల్దార్‌ తెలిపారు. 

మిరుదొడ్డిలో 10 రిజిస్టేషన్లు

మిరుదొడ్డి :   గురువారం మిరుదొడ్డి తహసీల్‌ కార్యాలయంలో అధికారులు 10 రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి రైతులకు నూతన పట్టాదారు పాసు బుక్కులను  తహసీల్దార్‌  సుజాత అందజేశారు. 

అరగంటలో  పూర్తి..

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట అర్బన్‌ తహసీల్‌ కార్యాలయంలో గురువారం 10 ధరణి రిజిస్ర్టేషన్లు చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ పద్మాకర్‌ ఆధ్వర్యంలో  తడ్కపల్లి, వెల్కటూరు, సిద్దిపేట, పొన్నాల, మిట్టపల్లి, ఎన్సాన్‌పల్లి, బక్రిచెప్యాల గ్రామాలకు చెందిన భూ క్రయవిక్రయదారులు ధరణి పోర్టల్‌ ద్వారా భూములను రిజిస్ర్టేషన్లు చేసుకున్నారు. రిజిస్ర్టేషన్లు  అర గంటలోనే  పూర్తికావడంతో భూ క్రయవిక్రయదారులు  సంతోషం వ్యక్తం చేశారు. 

గ్రామస్తులకు వరం..

దుబ్బాక : ధరణి పోర్టల్‌ గ్రామీణులకు వరంగా మారిందని దుబ్బాక తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక తహసీల్‌ కార్యాలయంలో 6 ధరణి రిజిస్ట్రేషన్లు జరిగాయని తహసీల్దార్‌  తెలిపారు. ఇప్పటివరకు 112 రిజిస్ట్రేషన్లు  చేశామన్నారు.

పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు..

చేర్యాల : ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి.  ధరణితో రిజిస్ట్రేషన్లు సులువుగా, పారదర్శకంగా, అరగంట వ్యవధిలో  పూర్తవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల తహసీల్‌ కార్యాలయంలో గురువారం వరకు  109 రిజిస్ట్రేషన్లు  చేశామని తహసీల్దార్‌ శైలజ తెలిపారు.  

సులువుగా రిజిస్ట్రేషన్లు..

కొమురవెల్లి :  ఎన్నో ఏండ్ల నుంచి కాని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ద్వారా సులువుగా జరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేసున్నారు. గురువారం కొమురవెల్లి తహసీల్‌ కార్యాలయంలో 4 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులు రిజిస్ట్రేషన్‌ పత్రాలు తీసుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

చాలా ఆనందంగా ఉంది..

మీసేవ కేంద్రంలో స్లాట్‌ను బుక్‌ చేసుకున్నా.  తర్వాత తహసీల్‌ కార్యాలయంలో అధికారులు నా పేరున ధరణి పోర్టల్‌ ద్వారా అర గంటలోనే భూమిని ఎక్కించి నాకు కొత్త పాసు బుక్కు అందించారు. ఇంత జల్దిగా పని కావడం చాలా సంతోషంగా ఉంది.  పైసా ఖర్చు లేకుండా పాసు బుక్కును అందజేయిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.                                                -ఉసికె కవితా కృష్ణమూర్తి, రుద్రారం,  (మిరుదొడ్డి) 


ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్‌ అయ్యింది..

తహసీల్‌ కార్యాలయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ సమయంలో నా పేరున భూమిని ఎక్కించి అధికారులు రిజిస్ట్రేషన్‌ చేశారు.  పైసా ఖర్చు లేకుండా వెంటనే పట్టాదారు పాసు బుక్కులను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరూ రుణ పడి ఉంటాం.                                                                                        

-గాజుల శ్యామల నరేందర్‌, రుద్రారం,  (మిరుదొడ్డి  )