అధికమాసం.. ఆలస్యంగా కల్యాణం

జనవరి 11వ తేదీన ‘మల్లన్న’ లగ్గం
అధిక మాసంతో 20 రోజుల ఆలస్యం
దేవుళ్లకు తప్పని అధిక మాసం ఎఫెక్ట్
చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణం ఈ ఏడాది నెల రోజులపాటు ఆలస్యంగా జరుగనున్నది. 2020లో అశ్వయుజ మాసం అధికంగా రావడంతో ఏటా డిసెంబర్ మాసంలో జరిగే మల్లన్న కల్యాణం 2021లో జనవరి రెండో వారంలో నిర్వహించనున్నారు. దేవుండ్ల పెండ్లిళ్లకు అధిక మాసం ఎఫెక్ట్ పడింది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కార్యక్రమాలను నిర్వహించడం అనవాయితీ. కానీ ఈ సంవత్సరం అశ్వయుజ మాసం అధికంగా రావడంతో స్వామి వారి పెండ్లి జనవరిలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
9 సంవత్సరాలుగా మల్లన్న కల్యాణం
డిసెంబర్ మాసంలోనే...
కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం తొమ్మిది సంవత్సరాలుగా పరిశీలిస్తే ఎనిమిది పర్యాయాలు డిసెంబర్ మాసంలో.. మూడుసార్లు నవంబర్, రెండుసార్లు జనవరి నెలలో ఆలయవర్గాలు ఘనంగా నిర్వహించాయి. 2011వ సంవత్సరంలో డిసెంబర్ 18, 2012న జనవరి 6న, 2013న డిసెంబర్ 29వ తేదీన, 2014న డిసెంబర్ 21న, 2015లో జనవరి 3న, 2016లో నంబర్ 25న, 2017న నవంబర్ 17న, 2018న డిసెంబర్ 30న, 2019వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన కొమురవెల్లి మల్లన్న కల్యాణం జరిగింది. ఈ సంవత్సరం 2021 జనవరి 11వ తేదీన మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు.
కల్యాణోత్సవంపై భక్తుల ఆరా
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభు త్వం పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చింది. భక్తులకు వసతులు కల్పిస్తుండటంతో ఆదరణ సైతం అన్ని ఆలయాలకు అదేస్థాయిలో పెరిగింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం మొదటి సారిగా నిర్వహించిన కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కావడంతో పాటు స్వామి వారికి 165 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కనీస వసతుల కోసం నిధులు కేటాయించడంతో మల్లన్న క్షేత్రం అభివృద్ధికి నోచుకుంది. మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆలయ ఆదాయం పెరగడంతో పాటు భక్తులకు వసతులు చేకూరాయి. దీంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని అధిక ప్రాచుర్యం లభించడంతో రాష్ట్ర నలుమూల నుంచి కల్యాణం తిలకించేందుకు లక్ష మంది భక్తులు హాజరవుతున్నారు. కాగా, డిసెంబర్ మాసంలో స్వామి వారి పెండ్లి ఏటా జరుగుతుందనే భావనలో ఉన్న భక్తులు ఈ ఏడాది ఎప్పుడు స్వామి వారి కల్యా ణం నిర్వహిస్తున్నారని ప్రతి రోజు ఆలయవర్గాలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 22న జరిగిన కల్యాణం ఈ సంవత్సరం జనవరి 11న జరుగనుండటంతో 20 రోజుల ఆలస్యంగా స్వామి వారి లగ్గం జరుగునున్నది.
తాజావార్తలు
- వ్యవసాయశాఖ పొలం- హలం శాఖగా మారాలి : సీఎం
- నేపాల్ ప్రధానిని బహిష్కరించిన కమ్యూనిస్ట్ పార్టీ
- హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా రహస్య డేటా చోరీకి టెక్కీ యత్నం!