బుధవారం 27 జనవరి 2021
Siddipet - Dec 03, 2020 , 00:02:37

బౌండరీలతో హోరెత్తించిన మంత్రి

బౌండరీలతో హోరెత్తించిన మంత్రి

12 బంతుల్లో 17 పరుగులు

సిద్దిపేట కలెక్టరేట్‌ :  నిన్నటి మొన్నటి వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం సిద్దిపేట మినీ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో అలరించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మినీ స్టేడియంలో జరిగిన టీ 20 మ్యాచ్‌లో సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ కెప్టెన్‌గా మెడికవర్‌ క్రికెట్‌ జట్టుతో డే అండ్‌ నైట్‌ టీ 20 మ్యాచ్‌ నిర్వహించారు. టాస్‌ గెలిచి మెడికవర్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ జట్టు బ్యాటింగ్‌ చేసింది.  తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది. దీంతో టీం కెప్టెన్‌గా ఉన్న మంత్రి హరీశ్‌రావు  బ్యాటింగ్‌కు దిగి 12 బంతుల్లో 3 బౌండరీలతో 17 పరుగులు చేసి జట్టులో ఉత్సాహాన్ని నింపారు. మంత్రి బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు  ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొడుతూ ఉత్సాహపర్చారు. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలో 86 పరుగులు చేసింది. 


logo