అంతర్జాతీయ స్థాయిలో సిద్దిపేటకు పేరు తీసుకురావాలి

సిద్దిపేట కలెక్టరేట్ : అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని క్రీడాకారులను మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ గ్రౌండ్లో బుధవారం అండర్ -14, అండర్ -19 ఫుట్‌బాల్ శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి కబడ్డీ క్రీడా పోటీల కోసం ఏర్పాటు చేసిన లాంగ్‌టర్మ్ శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు సిద్దిపేట - గజ్వేల్ నియోజకవర్గ జట్ల మధ్య కబడ్డీ పోటీని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని కబడ్డీ, ఫుట్‌బాల్ క్రీడాకారులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరం నిర్వహిస్తున్న కబడ్డీ జిల్లా అసొసియేషన్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శివకుమార్, ఫుట్‌బాల్ అసొసియేషన్ ప్రతినిధి అక్బర్‌ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి