శుక్రవారం 22 జనవరి 2021
Siddipet - Dec 02, 2020 , 00:29:13

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

  • స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • క్రియేటివ్‌ మీడియా సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణ

సిద్దిపేట కలెక్టరేట్‌ : స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత  మెప్మా ఆర్పీలదేనని క్రియేటివ్‌ మీడియా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం మెప్మా ఆర్పీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మహిళా గ్రూపు సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. చెత్తను తడి, పొడి, హానికర చెత్తలుగా విభజించి ట్రాక్టర్లకు ఇచ్చేలా వారిని చైతన్య పర్చాలని కోరారు. సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో ప్రతి మహిళా స్వచ్ఛ సర్వేక్షణ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని మార్కులు ఇవ్వాలన్నారు. పట్టణంలోని పబ్లిక్‌ టాయిలెట్స్‌, కమ్యూనిటీ టాయిలెట్స్‌ శు భ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెప్మా టౌన్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ సాయికృష్ణ మాట్లాడుతూ ఆర్పీలకు కేటాయించిన వారుల్లో మహిళా సంఘాల సమాచారం సేకరించి, వారు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డులో ముగ్గులు, వ్యాసరచన, ఆటల పో టీలు నిర్వహించి, బహుమతులు ఇవ్వాలని సూచించారు. శానిటేషన్‌ సిబ్బంది పనితీరుపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సాజిద్‌, సతీష్‌, మెప్మా సీవోలు రమ్య, జ్యోతి, రేణుక, స్వచ్ఛసర్వేక్షణ్‌ పర్యావరణ ఇం జినీర్‌ దిలీప్‌ సతీశ్‌, సామాజిక వేత్త డాక్టర్‌ శాంతి పాల్గొన్నారు.  


logo