బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 02, 2020 , 00:29:13

బండికి నెంబరు లేకుంటే ఛీటింగ్‌ కేసు

బండికి నెంబరు లేకుంటే ఛీటింగ్‌ కేసు

  • గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌ : వాహనాలకు నెంబరు ప్లేట్లు లేకుండా లేదా నెం బర్లు కనిపించకుండా చేసి వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్‌ 420కింద ఛీటింగ్‌ కేసులు నమోదు చేస్తామని గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన చౌరస్తాలో నెంబరు ప్లేట్లు లేని వాహనాలు, నెంబర్‌ ప్లేట్‌ సరిగా లేని, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపే వారిపై స్పె షల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 11వాహనాల ను గుర్తించి రూ.4,500 జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా సీఐ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నెంబర్‌ ప్లేట్లు వాహనాలకు బిగించాలన్నారు. నెంబరు ప్లేట్‌ లేకుండా వేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని తెలిపారు. నెంబర్లను కూడా కనిపించకుండా లేదా వేరే నెంబర్లను రాయడానికి ప్రయతిస్తున్నారని, ఇలాంటి వారిపై ఐపీసీ 420 కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించి వాహనాలను నడపాలన్నారు. ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్‌ ఎస్సై ఆనంద్‌గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారులపై రూ.13 వేల జరిమానా  

సిద్దిపేట టౌన్‌ : నెంబరు ప్లేట్‌ లేకుండా రోడ్డెక్కే వాహనాలను  గుర్తించి వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపించారు. సిద్దిపేటలోని బీజేఆర్‌ చౌరస్తా వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. 21 వాహనదారులను గుర్తించి రూ.13 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొందరు నెంబరు ప్లేట్‌ లేని వాహనాలపై వచ్చి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారి ని గుర్తించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు చెప్పారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని, సీటు బెల్టు, హెల్మెట్‌ ధరించాలని సూచించారు. తనిఖీల్లో ట్రాఫిక్‌ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo