శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 01, 2020 , 01:18:50

మల్చింగ్‌ సాగు భలే బాగు

మల్చింగ్‌ సాగు భలే బాగు

  • కూరగాయల సాగులో పెరుగుతున్న మల్చింగ్‌ 
  • సాగునీటి ఆదా, పైరుకు ఆరోగ్య వాతావరణం
  • కలుపు నివారణ, పూర్తి స్థాయిలో ఎరువుల సద్వినియోగం
  • నాణ్యమైన దిగుబడులకు దోహదం

గజ్వేల్‌:  మల్చింగ్‌ సాగు విధానం రైతులకు బహుళ ప్ర యోజనాలను అందిస్తున్నది. చిన్న, సన్నకారు రైతులకు అనువుగా ఉండటమేగాకుండా చిన్న కమతాలలో కూడా సాగుకు వీలుండటంతో రైతులు మల్చింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. కలుపు నివారణ, సాగునీటి ఆదా, ఎరువులు, కూలీల ఖర్చు తగ్గడంతో పాటు పెట్టుబడి కలసి రావడమేగాకుండా నాణ్యమైన అధిక దిగుబడులు అందివస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, పూలతోటలకు మల్చింగ్‌ సాగు పద్ధతి అనుకూలం కాగా తెలంగాణాలో మెట్ట పంటల సాగుకు ఉపయోగకరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా చిన్న, సన్న కారు రైతులు తమకున్న కొద్దపాటి పొలంలో కూరకాయల సాగులో మల్చింగ్‌ విధానంతో మంచి దిగుబడులు పొం దుతున్నారు. సీఎం కేసీఆర్‌ కూరకాయల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలని పలు రకాల రాయితీలు అందించడం కూడా శాస్త్రీయ అధునాతన సాగు పద్ధతుల వైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లాలో డ్రిప్‌ వాడకం పెరుగడం, దానికి అనుసంధానంగా మల్చింగ్‌ షీట్‌ వాడటం పర్టిగేషన్‌ పద్ధతుల వల్ల కలపు బెడద తగ్గడం, అవసరం మేరకు నీరు అందడంతో పాటు మోతాదుగా ఎరువుల వాడకం వల్ల వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఏపుగా పైరు పెరిగి మంచి దిగుబడులు అందివస్తున్నాయి.  

  పెద్ద రైతులకే పరిమితమైన డ్రిప్‌, మల్చింగ్‌, పర్టిగేషన్‌ పద్ధతులు ఇప్పుడు చిన్న, సన్నకారు రైతుకు అందుబాటులోకి వచ్చింది.   పైరు వేళ్లను మట్టితో ప్లాస్టిక్‌ షీట్‌తో కప్పి ఉంచడం మల్చింగ్‌ విధానం. 

  భూమిపై ప్లాస్టిక్‌ షీట్‌ కప్పి భయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను పైరుకు అనుకూలంగా మార్చడం, అతినీలలోహిత, పరారుణ కిరణాలను మల్చింగ్‌ షీట్‌ల వల్ల క్రమబద్ధీకరించి పైరుకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పర్చడానికి వీలు కలుగుతుంది. దీంతో కలుపు మొక్కలకు సూర్యరశ్మి అందకపోవడం 80శాతం కలుపు తగ్గుతుంది. భూమిలో తేమ ఆవిరి కాకుండా ఉండడానికి వీలు కలగడంతో సాగునీటి ఆదా సైతం 50నుంచి 60శాతం వరకు కలిసి వస్తుంది. ఇంకా చీడ, పీడ తెగుళ్ల నివారణకు మల్చింగ్‌ విధానం అనుకూలం. ప్రస్తుత యాసంగి సీజన్‌లో కూరగాయలు, పండ్లు, పూలతోటలు సాగుచేసే రైతులకు మల్చింగ్‌ విధానం మంచి ప్రయోజనం చేకూర్చుతుంది. పంట రకాలు, సాగు పద్ధతులను బట్టి  మల్చింగ్‌ షీట్‌లను ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు నాటేముందు, నాటిన తరువాత మల్చింగ్‌ షీట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. దుక్కిని బోదెలుగా మార్చుకుని మల్చింగ్‌ షీట్‌ను బోదెలపై పరిచి షీట్‌ చివరను మట్టిలో కప్పి ఉంచుతారు. విత్తనాలు నాటే ప్రాంతంలో షీట్‌కు రంద్రాలు చేసి విత్తనాలు నాటి డ్రిప్‌ ద్వారా నీరందిస్తారు. నారు నాటే వారు నాటే ప్రాంతంలో రంద్రాలు చేసి నీటి పదనులో మొక్కలను నాటుతారు. పందిరి సాగులో కూడా మల్చింగ్‌ విధానం అనుకూలంగా ఉంటుంది. 

పలు ప్రయోజనాలు

      మల్చింగ్‌ నేలలోని తేమ ఆవిరి కాకుండా నివారణ జరుగుతుంది. 40శాతం 60శాతం వరకు సాగునీటి ఆదా అవుతుంది. సూర్యరశ్మి భూమిపై పడక పోవడంతో కలుపు మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ జరిగే అవకాశాలు లేకపోవడంతో 80శాతం కలుపు తగ్గుతుంది. అతినీలలోహిత, పరారుణ కిరణాలను తట్టుకుని కలుపు మొక్కలను ఎదగకుండా చేస్తాయి. భూసా ర పరిరక్షణ, మట్టికోత నివారణకు మల్చింగ్‌ విధానం అనుకూలం కాగా ఎరువులు, క్రిమిసంహారక మందుల ఆదా, పర్యావరణ పరిరక్షణకు వీలు కలుగడంతో పాటు  నాణ్యమైన అధిక దిగుబడులు వస్తున్నాయి. భూమిలోని పోషకాలు పైరుకు సరైన విధంగా అందడమేగాకుండా రైతు అందించిన ఎరువులు నీరు పైరుకు వంద శాతం అందుతుంది. 

 సన్న, చిన్నకారు రైతులు చిన్న చిన్న మడులలో సైతం ఏర్పాటు చేసుకునే వీలున్న  మల్చింగ్‌ విధానానికి తక్కువ ఖర్చు అవుతుంది.  కూరగాయల పంటల సాగులో వర్గల్‌, ములుగు, మర్కూక్‌, గజ్వేల్‌ తదితర  ప్రాంతాల్లో టమాట, వంగ, బీర, కాకర, పొట్ల, దొండ, పచ్చి మిర్చి, సొర పంటలతో పాటు పూలు, పండ్ల తోటల సాగులో మల్చింగ్‌ విధానం కొనసాగిస్తున్నారు.  పంట రకాలను బట్టి రూ. 3 నుంచి రూ. 5వేల లోపు ఎకరాకు ఖర్చు వస్తుంది. ఒక్కో షీటును రెండు మూడు పంటలకు కూడా వాడుకునే వీలుంటుంది. 

VIDEOS

logo