శనివారం 23 జనవరి 2021
Siddipet - Dec 01, 2020 , 01:02:10

అమలులో సిటీ పోలీసు యాక్టు

అమలులో సిటీ పోలీసు యాక్టు

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో ఈ నెల 15 వరకు సిటీ పోలీసు యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మెదక్‌ జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్టు అమలు


మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31 తేదీ వరకు 30, 30 (ఎ) పోలీసు యాక్టు 1861 అమలులో ఉంటుందని మెదక్‌ ఎస్పీ చందనదీప్తి తెలిపారు.  పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. జిల్లా ప్రజ లు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు సహకరించాలని తెలిపారు.


logo