ఆదివారం 24 జనవరి 2021
Siddipet - Nov 29, 2020 , 00:13:36

పునరావాస కాలనీలపై ప్రత్యేక దృష్టి

 పునరావాస కాలనీలపై ప్రత్యేక దృష్టి

సిద్దిపేట కలెక్టరేట్‌ : ముట్రాజ్‌పల్లి పునరావాస కాలనీపై ప్రత్యేక దృష్టి సారించామని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో శనివారం డీఆర్డీవో చెన్నయ్యతో కలిసి ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీపై సమీక్షించారు. ముంపు గ్రామాల్లోని భూ నిర్వాసితులకు ప్లాట్‌ అలాట్‌మెంట్‌, విధి విధానాలు, ముంపునకు గురైన భూ నిర్వాసితులకు ఇండ్ల కేటాయింపుతో పాటు పునరావాస కాలనీల్లో మిషన్‌ భగీరథ, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యాలు తదితర కీలక అంశాలపై అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. logo