శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 28, 2020 , 00:17:15

సెల్‌ఫోన్‌లో ధరణి సమాచారం

సెల్‌ఫోన్‌లో ధరణి సమాచారం

  • ఆన్‌లైన్‌లో భూముల సమాచారం
  • ధరణి పోర్టర్‌తో మొబైల్‌లో సమాచారం చూసుకునే అవకాశం

గజ్వేల్‌ రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టర్‌తో రైతుల కష్టాకు చెక్‌ పడింది. క్షణాల్లోనే రైతుల భూములకు సంబంధించిన సమాచారాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం క్షణాల వ్యవధిలోనే రైతులు తమ సెల్‌ఫోన్‌లో ధరణిపోర్టర్‌ ఓపెన్‌ చేసి వివరాలు తెలుసుకునే అవకాశం మన ముందుకొచ్చింది. గతంలో రెవెన్యూ సిబ్బందితో రైతులు పడిన ఇబ్బందులకు చెక్‌ పెట్టి ప్రభుత్వం ఏండ్ల తరబడి సమస్యకు పరిష్కారం చూపించింది. మండల కేంద్రాల్లోని తహసీల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచి సమస్త సమాచారాన్ని పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొన్ని రోజుల నుంచి కొనసాగుతండగా నిమిషాల వ్యవధిలో పని పూర్తవుతోంది.      

ధరణి పోర్టర్‌ ప్రారంభంకాక ముందు రైతుల తమ భూముల వివరాలు తెలుసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఆయా గ్రామాల నుంచి దూరంగా ఉన్న మండల కేంద్రాల్లోని మీసేవ కేంద్రాల్లో భూ వివరాలను తెలుసుకునే అవకాశం ఉండేది. కొన్ని సందర్భాల్లో సర్వర్‌ బిజీ ఉంటే రోజుల తరబడి మీసేవ కేంద్రాల వద్ద రైతులు భూ సమాచారం కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. పహాణీల కోసం రోజుల తరబడి వేచి చూసిన రైతులకు సకాలంలో వచ్చేవి కావు. రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో అనేక సమస్యలతో రైతులు చాలా సందర్భాల్లో సతమతం అయ్యేవారు. రికార్డుల్లో విస్తీర్ణం తక్కువగా, సర్వే నెంబర్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలుండేవి. కానీ, నేడు ధరణి పోర్టర్‌తో రైతులకు తక్షణమే న్యాయం జరుగుతోంది. తమ అవసరాల కోసం భూములు అమ్మలన్నా పంటల సాగు కోసం అవసరమైన పత్రాలు తీసుకొకోవాలన్నా తిప్పలు తప్పేవి కావు. కానీ నేడు సెల్‌ఫోన్‌లోనే భూమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం తెలంగాణ సర్కార్‌ రైతుల మందుకు తీసుకురావడంతో గ్రామీణ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. భూ సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు భూముల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేసి ధరణి పోర్టర్‌లో పొందుపర్చడంతో క్షణాల్లో సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని చూసుకునే అవకాశం రైతుల ముందుకు రావడంతో వారి కష్టాలకు చెక్‌ పడింది.

గత నెలలో ధరణి పోర్టర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించడంతో రైతులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రావడంతో వారి కష్టాలు తీరాయి. సెల్‌ఫోన్‌లోనే ప్రతి రైతు భూముల సమాచారాన్ని చూసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌లో ధరణి పోర్టర్‌ను ఓపెన్‌ చేయగానే ల్యాండ్‌ డిటేల్స్‌ సెర్చ్‌ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఖాతా ఆధార్‌కార్డు నెంబర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం, సర్వే నెంటర్లను నమోదు చేస్తే ఫోన్‌స్కీన్‌పై కనిపిస్తాయి. పట్టాదారు పూర్తి పేరు, భర్త లేదా తండ్రి పేరు, భూ విస్తీర్ణం, ఎకరానికి ఉన్న మార్కెట్‌ విలువ తెలుస్తోంది. 

ధరణి సేవలు రైతులకు మంచి అవకాశం

సెల్‌ఫోన్‌లో భూముల వివరాలు తెలుసుకునే అవకాశం రైతుల ముందుకే రావడంతో ఎంతో మందికి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుం డా పోయింది. ధరణితో చాలా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ పూర్తవగానే రైతులకు తక్షణమే భూవివరాలకు సంబంధించిన పత్రాలను అందజేస్తున్నాం. 

-విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో, గజ్వేల్‌ 

VIDEOS

logo