గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 27, 2020 , 00:16:56

రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలి

 రాజ్యాంగంపై అవగాహన  పెంపొందించుకోవాలి

గజ్వేల్‌అర్బన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం గజ్వేల్‌ పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ కూడలిలో తిరిగి ప్రతిష్ఠించిన రాజ్యాంగ స్తూపానికి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, కౌన్సిలర్‌ బొగ్గుల చందు, ఏఎంససీ డైరెక్టర్‌ శీలసారం ప్రవీణ్‌, అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు గంట శంకరయ్య, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు, డీబీఎఫ్‌ నాయకులు  పాల్గొన్నారు. 

కొండపాకలో..  

కొండపాక : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిమ్మనగూడలో ..

గజ్వేల్‌ రూరల్‌: భారత రాజ్యాంగ దినోత్సవం  సందర్భంగా రిమ్మనగూడలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు.  అధ్యక్షుడు స్వామి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ..

సిద్దిపేట రూరల్‌/టౌన్‌ :  రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో రవికాంత్‌రావు రాజ్యాంగ ప్రవేశిక చదివి వినిపించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లో అతి పెద్ద రాజ్యాంగం మనదే నని గుర్తు చేశారు. ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డి, సెక్టోరల్‌ అధికారి, డా.రమేశ్‌ తాళ్లపల్లి, సూపరిండెంట్లు యశోద, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండల లీగల్‌ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సిద్దిపేట న్యాయస్థానంలో జరిగింది.   

సిద్దిపేట కలెక్టరేట్‌ :  రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు.  సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రత్నం, జిల్లా కన్వీనర్‌ సంతోష్‌,  ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రవీణ్‌ కుమార్‌, రిటైర్డ్‌ తహసీల్దార్‌ విజయ్‌ భాస్కర్‌, సరమసత వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజం, బత్తుల నారాయణ, ధరావత్‌ రమేశ్‌, సిద్ధి సాగర్‌, కనకరాజు, జగన్‌ ప్రవీణ్‌రెడ్డి, నరేశ్‌, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo