సోమవారం 25 జనవరి 2021
Siddipet - Nov 26, 2020 , 00:15:20

నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

నిరుపేదలకు వరం  సీఎం సహాయనిధి

  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • 17 మంది లబ్ధిదారులకు రూ.6,11,500 చెక్కుల అందజేత 

సిద్దిపేట కలెక్టరేట్‌:  సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో 17 మంది లబ్ధిదారులకు రూ.6,11,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు. పట్టణానికి చెందిన 9 మందికి రూ.4,55,500, సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఒక్కరికి రూ.12,500, చిన్నకోడూరు మండలంలోని ఇద్దరికీ రూ.30 వేలు, నంగునూరు మండలంలోని ముగ్గురికి రూ. 75,500, నారాయణరావుపేట మండలంలోని ఇద్దరికి రూ.38,500 చొప్పున చెక్కులను అందజేశారు. చెక్కులను లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. logo