గురువారం 28 జనవరి 2021
Siddipet - Nov 26, 2020 , 00:15:28

వరాలకు కృతజ్ఞతలు

వరాలకు కృతజ్ఞతలు

సిద్దిపేట కలెక్టరేట్‌ : సీఎం కేసీఆర్‌ రజకులపై కురిపించిన వరాలకు కృతజ్ఞతగా జిల్లా కేంద్రం సిద్దిపేటలోని స్థానిక మోడల్‌ దోబీఘాట్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్లెక్సీలకు దోబీఘాట్‌ అధ్యక్షుడు ముత్తయ్య, కార్యవర్గం బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముత్తయ్య మాట్లాడుతూ.. గతంలో సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. గంటల తరబడి నీటిలో నిలబడి బట్టలు ఉతకడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేవన్నారు. సమస్యలు తెలిసిన మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో మోడల్‌ దోబీఘాట్‌ ఏర్పాటు చేయించారన్నారు. దాని ద్వారా మంచి ఫలితాలను పొందుతున్నామన్నారు. కేవలం మెయింటెనెన్స్‌ విషయంలో కరెంట్‌ బిల్లులుఎక్కువ రావడం తమకు భారంగా మారిందని పలు సందర్భాల్లో మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ దోబీఘాట్లు, లాండ్రీలకు ఉచిత కరెంట్‌ అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ వెన్నంటే రజకులందరూ ఉంటారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చౌటి పరశురాములు, చౌటి అంజయ్య, భూంపల్లి యాదగిరి, బోనగిరి కనకయ్య, శ్రీనివాస్‌, రమేశ్‌, మురళి, మహేశ్‌ పాల్గొన్నారు.  


logo