ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Nov 25, 2020 , 00:07:47

సమస్యలను పరిష్కరించాలి

సమస్యలను పరిష్కరించాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల్లో తీవ్ర జాప్యం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని టీఎన్‌జీవో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌, కార్యదర్శి కోమాండ్ల విక్రమ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, కార్యదర్శి ప్రతాప్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.   సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. 

VIDEOS

logo