గురువారం 04 మార్చి 2021
Siddipet - Nov 25, 2020 , 00:07:45

ఆర్‌అండ్‌ఆర్ పనుల్లో వేగం పెంచాలి

ఆర్‌అండ్‌ఆర్  పనుల్లో వేగం పెంచాలి

  • అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలి
  • మిషన్‌ భగీరథ, విద్యుత్‌ సరఫరా పనులను ముమ్మరం చేయండి
  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి
  • ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులపై నిర్మాణ సంస్థలతో సమీక్ష

గజ్వేల్‌అర్బన్‌ : ముట్రాజ్‌పల్లిలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి నిర్మాణ సంస్థలను ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికార యంత్రాంగం అంతా కలిసి సమష్టిగా పని చేద్దామన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ గృహ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. మిషన్‌ భగీరథ, విద్యుత్‌ సరఫరా పనులను ముమ్మరం చేసి కాలనీలను పూర్తిస్థాయిలో నివాసానికి సిద్ధం చేయాలన్నారు. యూజీడీ పైపులైన్లు, సీవరేజి పైపులైన్లు, స్ట్రామ్‌ వాటర్‌, ఇంటర్నల్‌ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, సీసీరోడ్లు తదితర అంశాలపై చర్చించారు. ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి చర్చించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కనకరత్నం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసచారి, ఈఈ రాజయ్య, డీఈ నాగభూషణం, పీఆర్‌ డీఈ ప్రభాకర్‌, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

VIDEOS

logo