గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 25, 2020 , 00:07:27

హోంగార్డు కుటుంబాలకు చెక్కులు అందజేత

హోంగార్డు కుటుంబాలకు చెక్కులు అందజేత

సిద్దిపేట టౌన్‌ : అకాల మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు పోలీసులు బాసటగా నిలిచారు. పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సూచన మేరకు తలా కొంత సాయం చేసి మేమున్నామని చాటారు. పోలీసులు అందించిన ఆర్థిక సాయాన్ని మంగళవారం మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు సీపీ జోయల్‌ డెవిస్‌ అందించారు. వివరాల్లోకి వెళితే... కమిషనరేట్‌లో హోంగార్డుగా పని చేస్తున్న సలీమ్‌ 2019లో రోడ్డు ప్రమాదంలో, విశ్వనాథ్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఆ కుటుంబాలకు అండగా నిలువాలని సీపీ జోయల్‌ డెవిస్‌ సూచించారు. హోంగార్డు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను సీపీ జోయల్‌ డెవిస్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాసులు, ఏవో సవిత, ఆర్‌ఐ డెవిడ్‌ విజయ్‌కుమార్‌, పోలీసు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లు ఉన్నారు.  

VIDEOS

logo